

ఒకప్పుడు బాలీవుడ్‌లో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్‌లో తన కెరీర్‌ను మరింత విస్తరించేందుకు కృషి చేస్తోంది. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె, హిందీ సినీ ప్రయాణంలో భారతదేశంలోని అగ్ర దర్శకులు, నటీనటులతో కలిసి వివిధ శైలుల్లో నటించే అవకాశాలు లభించాయని తెలిపింది. అయితే హాలీవుడ్‌లో ఆ స్థాయి వైవిధ్యమైన అవకాశాలు ఇంకా రాలేదని, ఇకపై ప్రయోగాత్మక పాత్రలతో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది.
తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతూ, వివాహం మరియు తల్లితనంతో తన ప్రాధాన్యతలు పూర్తిగా మారిపోయాయని ప్రియాంక తెలిపింది. ఉద్యోగ బాధ్యతలతో పాటు తల్లిగా జీవితం కొనసాగించడం ఒక కొత్త అనుభవమని పేర్కొంది. తాను తల్లి అయిన తర్వాత తన అమ్మపై గౌరవం మరింత పెరిగిందని, తల్లితనంలోని బాధ్యతలు, కష్టాలను ఇప్పుడు మరింతగా అర్థం చేసుకున్నానని చెప్పింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!