

ఈ ఏడాది బతుకమ్మ పండగ సందర్భంగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) ఆధ్వర్యంలో ‘యంగ్ ఫిల్మ్‌మేకర్ ఛాలెంజ్ 2026 సీజన్ 2’ పోటీలను ప్రకటించారు. ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, ఎఫ్‌డీసీ ఎండీ జీ. ముకుంద రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ క్రియేటివ్ డైరెక్టర్ రాజ్ కొండా, ఎఫ్‌డీసీ ఈడీ కిషోర్ బాబులతో కలిసి ప్రత్యేక పోస్టర్‌ను ఆవిష్కరించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పండుగలు, కళారూపాలు, ప్రభుత్వ పథకాలపై లఘు చిత్రాలు, పాటల పోటీలు నిర్వహించనున్నారు. ఈసారి జానపద పాటలు, ప్రభుత్వ పథకాలపై ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియోలు, వ్యాసాలకు కూడా అవకాశం కల్పించారు.
లఘు చిత్రాల నిడివి మూడు నిమిషాలకు, పాటల రన్‌టైమ్ ఐదు నిమిషాలకు మించకూడదు. వీడియోలు 4కే రిజల్యూషన్‌లో ఉండాలి. ఆసక్తి ఉన్నవారు తమ ఎంట్రీలను 2026 సెప్టెంబర్ 15లోపు ఈమెయిల్ లేదా వాట్సాప్ ద్వారా పంపాలి. ప్రథమ బహుమతిగా రూ.3 లక్షలు, ద్వితీయ బహుమతిగా రూ.2 లక్షలు, తృతీయ బహుమతిగా రూ.లక్ష అందించనున్నారు. మరో ఐదుగురికి రూ.20 వేల చొప్పున కన్సోలేషన్ బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేస్తారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!