

ప్రముఖ సంగీత దర్శకుడు రవి బస్రూర్ KGF, Salaar: Part 1 – Ceasefire, Toxic వంటి చిత్రాలకు అందించిన అద్భుతమైన నేపథ్య సంగీతంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా తెలుగు చిత్రం Cult టీజర్ లాంచ్ కార్యక్రమంలో ఆయన తన జీవితంలోని కఠినమైన రోజులను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. Cult చిత్రానికి దర్శకత్వం వహించిన నటుడు విశ్వక్ సేన్.. వేదికపై రవి బస్రూర్‌ను ఆశ్చర్యపరుస్తూ రోలెక్స్ వాచ్‌ను బహుమతిగా అందించారు. ఈ గౌరవం కేవలం ఒక ఖరీదైన వాచ్ కాదని, తన సంగీత ప్రయాణానికి లభించిన గుర్తింపుగా భావిస్తున్నానని రవి బస్రూర్ తెలిపారు.
ఈ సందర్భంగా తన గతాన్ని గుర్తుచేసుకున్న రవి బస్రూర్.. చిన్న వయసులో ఎదుర్కొన్న తీవ్ర ఇబ్బందులను వెల్లడించారు. 18 ఏళ్ల వయసు వచ్చేలోపే రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు చెప్పారు. ఆ క్లిష్ట సమయంలో తన సంగీతాన్ని విన్న రవి అనే వ్యక్తి తనను ఆదుకున్నారని, కీబోర్డ్ కొనిచ్చడంతో పాటు రూ.35 వేలు ఇచ్చారని తెలిపారు. ఆ వ్యక్తి చూపిన మానవత్వం తన జీవితాన్ని మలుపుతిప్పిందని, ఆయనకు కృతజ్ఞతగా తన పేరును ‘రవి’గా మార్చుకున్నానని వెల్లడించారు. కష్టాల నుంచి అగ్రశ్రేణి సంగీత దర్శకుడిగా ఎదిగిన తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ రవి బస్రూర్ చేసిన ఈ వ్యాఖ్యలు కార్యక్రమానికి హాజరైన వారిని భావోద్వేగానికి గురిచేశాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!