
జనరల్

నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ సినిమాలోని ‘దబిడి దిబిడి’ పాటలో వివాదాస్పదమైన స్టెప్‌పై కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ స్పందించారు. ఆ స్టెప్‌ను కంపోజ్ చేసినందుకు ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నానని తెలిపారు. స్పెషల్ సాంగ్‌కు తగిన విధంగానే ఆ స్టెప్‌ను రూపొందించానని, అయితే ప్రేక్షకులు దాన్ని మరో విధంగా అర్థం చేసుకోవడంతో వివాదం పెద్దదైందని చెప్పారు.
ఈ పాటకు తానే కొరియోగ్రఫీ చేశాననే విషయం చాలామందికి తెలియదని శేఖర్ మాస్టర్ వెల్లడించారు. పాట స్వభావం, ఎనర్జీకి అనుగుణంగానే స్టెప్‌ను రూపొందించానని, అయితే ప్రేక్షకుల స్పందనతో అది పెద్ద చర్చకు దారి తీసిందని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!