

రవితేజ–శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది. ఈ వారం యశ్ నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ.. ‘ఇరుముడి’ వసూళ్లపై పెద్దగా ప్రభావం కనిపించలేదని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విడుదలైన కొత్త సినిమాతో పోటీ ఉన్నా ‘ఇరుముడి’కి ప్రేక్షకుల ఆదరణ కొనసాగుతోంది.
బుక్‌మైషోలో నమోదైన వీకెండ్ బుకింగ్స్ ప్రకారం.. ‘టాక్సిక్’కు సుమారు 15 వేల టికెట్లు అమ్ముడవగా, ‘ఇరుముడి’ మాత్రం 23 వేలకు పైగా టికెట్లతో ముందంజలో ఉన్నట్లు సమాచారం. తక్కువ థియేటర్లలో ప్రదర్శితమవుతున్నప్పటికీ కుటుంబ ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణ ‘ఇరుముడి’కి ప్రధాన బలంగా మారింది. ఇదే జోరు కొనసాగితే సినిమా మరిన్ని రోజులు బాక్సాఫీస్ వద్ద బలమైన వసూళ్లు సాధించే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!