

అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా అట్లీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సాయి అభ్యంకర్‌ను ప్రశంసించిన ఆయన ‘రాకా’ను ఆస్కార్ వరకు తీసుకెళ్లి తమిళ ప్రజలను గర్వపడేలా చేస్తానని అన్నారు. దీంతో ఈ సినిమా తెలుగు హీరోతో తెరకెక్కుతున్న తమిళ చిత్రమా? లేక తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారా? అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి.
ఇక ‘రాకా’ విడుదల విషయంలోనూ చిత్రబృందంలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమాను 2027, 2028లో రెండు భాగాలుగా విడుదల చేయాలా? లేక 2028లో ఒకే చిత్రంగా విడుదల చేయాలా? అనే అంశంపై పరిశీలన జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి తుది నిర్ణయం వెలువడలేదు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంపై త్వరలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!