

తెలుగులో వచ్చిన ‘కేరింత’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన సుకృతి అంబటి తల్లయ్యారు. మగబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా తన బిడ్డకు సంబంధించిన ఓ ఫొటోను కూడా పోస్ట్ చేయడంతో ఈ విషయం కాస్తా వైరల్‌గా మారింది. దీంతో పలువురు నెటిజన్లు సుకృతికి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఢిల్లీకి చెందిన సుకృతి అంబటికి చిన్నప్పటి నుంచే డ్యాన్స్, నటనపై ఆసక్తి ఉండేది. చదువుకునే రోజుల్లోనే తన ప్రతిభను చాటుకున్న ఆమెకు దిల్ రాజు నిర్మించిన ‘కేరింత’లో భావన పాత్రలో నటించే అవకాశం దక్కింది. సినిమా మంచి స్పందన అందుకున్నప్పటికీ ఆ తర్వాత సుకృతి మరో సినిమాలో కనిపించలేదు. నటనకు దూరంగా ఉంటూ వ్యక్తిగత జీవితంపైనే దృష్టి పెట్టారు.
దాదాపు నాలుగేళ్ల క్రితం అక్షయ్ సింగ్‌ను సుకృతి వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తూ వచ్చిన ఆమె, ఈ ఏడాది ఏప్రిల్‌లో తాను గర్భవతిననే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తాజాగా మగబిడ్డకు జన్మనిచ్చినట్లు ప్రకటించడంతో అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు. పెళ్లి తర్వాత పూర్తిగా కుటుంబ జీవితానికే ప్రాధాన్యత ఇచ్చిన సుకృతి.. ఇప్పుడు తల్లిగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. బిడ్డ జన్మించిన ఆనందాన్ని అభిమానులతో పంచుకోవడంతో ఆమె పోస్ట్‌కు పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. సుకృతికి శుభాకాంక్షలు చెబుతూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో కేరింత హీరోయిన్‌కు సంబంధించిన ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!