

హీరో కిరణ్ అబ్బవరం పుట్టినరోజు వేడుకల మధ్య 'చెన్నై లవ్ స్టోరీ' చిత్ర గ్రాండ్ ప్రెస్ మీట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్లపై ఎస్‌కేఎన్, సాయి రాజేశ్ నిర్మించగా, సాయి రాజేశ్ కథను అందించి రవి నంబూరి దర్శకత్వం వహించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్రబృందం సినిమాపై పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేసింది.
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, ఈ సినిమా తన కెరీర్‌లో చిరస్థాయిగా గుర్తుండిపోయే చిత్రంగా నిలుస్తుందని అన్నారు. హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ దీనిని హార్డ్ హిట్టింగ్ లవ్ స్టోరీగా అభివర్ణించగా, దర్శకుడు రవి నంబూరి స్టీవెన్-నివి పాత్రల మధ్య వచ్చే సంభాషణలు ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోతాయని తెలిపారు. నిర్మాత, కథా రచయిత సాయి రాజేశ్ కిరణ్ నటనకు ప్రశంసలు అందగా, నిర్మాత ఎస్‌కేఎన్ ప్రీమియర్స్ నుంచే ఈ సినిమా ప్రశంసలు అందుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. టైటిల్ ప్రేమకథను సూచించినప్పటికీ, బలమైన మాస్ ఎలిమెంట్స్‌తో పాటు భావోద్వేగాలు, వినోదం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చిత్రబృందం తెలిపింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!