
క్రీడలు

అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన లెనిన్ సినిమా జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంది.
తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జూలై 5న తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఎవరు అనేది ఇంకా వెల్లడించలేదు. దీంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహించగా, ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!