

చార్మింగ్ స్టార్ శర్వానంద్ తన తదుపరి చిత్రం ‘భోగి’తో సరికొత్త మాస్ అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తుండగా, లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ‘భోగి’ని నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. డిసెంబర్, జనవరి నెలల్లో పెద్ద సినిమాల విడుదలలు ఎక్కువగా ఉండటంతో, వాటి పోటీని దృష్టిలో ఉంచుకుని ఈ తేదీని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే, అదే సమయంలో రష్మిక మందన్న నటిస్తున్న ‘మైసా’తో ‘భోగి’ బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది.
1960ల ప్రారంభంలో తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ఓ కల్పిత గ్రామం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. అప్పటి కాలపు వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ కుటుంబ భావోద్వేగాలు, ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలతో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సెన్సార్‌కు సంబంధించిన సమస్యల కారణంగా సినిమా విడుదల ఆలస్యమైనట్లు సమాచారం. ఈ పాత్ర కోసం శర్వానంద్ తన లుక్‌తో పాటు శరీరాకృతిలోనూ గణనీయమైన మార్పులు చేసుకున్నారు. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. పీరియాడిక్ నేపథ్యం, యాక్షన్ అంశాలు, శర్వానంద్ కొత్త అవతారంతో ‘భోగి’పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!