

కేరళ ఆరోగ్య మంత్రి కే. మురళీధరన్ వందేమాతరం గీతం పూర్తికాకముందే వేదికపై కూర్చోవడం వివాదానికి దారితీసింది. కాసరగోడ్‌లోని ముల్లేరియా ఫ్యామిలీ హెల్త్ సెంటర్‌లో నూతన ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గీతంలోని తొలి రెండు చరణాలు పూర్తికాగానే మంత్రి సహా వేదికపై ఉన్న కొందరు కూర్చునేందుకు ప్రయత్నించారు. అయితే గానం కొనసాగడంతో వారు కూర్చున్నట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి.
ఈ ఘటనలో జిల్లా కలెక్టర్, కాసరగోడ్ ఎంపీ రాజ్‌మోహన్ ఉన్నితన్, ఎమ్మెల్యే కే. మహిన్ కూడా కూర్చున్నట్లు దృశ్యాల్లో కనిపించింది. మరోవైపు ఎమ్మెల్యే కే. నీలకంఠన్, డీసీసీ అధ్యక్షుడు పి.కే. ఫైసల్ గీతం పూర్తయ్యే వరకు నిలబడే ఉన్నారు. అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం తొలి రెండు చరణాలు మాత్రమే ఆలపించాలన్నది మురళీధరన్ గతంలో వెల్లడించిన అభిప్రాయం. ఈ ఘటనతో రాష్ట్రంలో వందేమాతరం ఆలాపనపై రాజకీయ చర్చ మరోసారి వేడెక్కింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!