

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’ అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల మహేశ్ బాబు ఎయిర్‌పోర్ట్‌లో ధరించిన ‘వారణాసి’ థీమ్ షర్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. షర్ట్ వెనుక భాగంలో శివుని త్రిశూలం, నంది, విభూతి రేఖల డిజైన్లు ఉండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
క్లాసిక్ డెనిమ్ జీన్స్, బ్లాక్ సన్‌గ్లాసెస్‌తో మహేశ్ బాబు లుక్ సింపుల్‌గా ఉన్నప్పటికీ రాయల్‌గా కనిపించింది. షూటింగ్ సమయంలో ఆయన ధరించిన లగ్జరీ దుస్తులు, సుమారు రూ.80 వేల విలువైన ‘జెగ్నా’ క్యాప్ వివరాలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోవైపు మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘వారణాసి’ అధికారిక మర్చండైజ్ టీ-షర్టులను అభిమానులకు అందుబాటులోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!