

సత్యదేవ్ కథానాయకుడిగా వెంకటేష్ మహా తెరకెక్కించిన సైకలాజికల్ థ్రిల్లర్ రావు బహదూర్ విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రచార చిత్రాలతో ఆసక్తి రేపిన ఈ సినిమా ఇప్పుడు ట్రైలర్‌తో మరింత చర్చలోకి వచ్చింది. అయితే ఈ ట్రైలర్‌లో కథ కంటే ఎక్కువగా ఆకట్టుకున్న అంశం సూపర్ స్టార్ మహేష్ బాబు చెప్పిన వాయిస్ ఓవర్. అనుమానం అనే భావోద్వేగాన్ని కేంద్రంగా చేసుకుని సాగే కథను ఆయన తనదైన శైలిలో పరిచయం చేయడం ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారింది. దీంతో సినిమా ఎలా ఉండబోతోందన్న ఆసక్తి ప్రేక్షకుల్లో మరింత పెరిగింది.
ట్రైలర్ చివర్లో ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని మహేష్ చెప్పిన మాటలు మరింత క్యూరియాసిటీ పెంచుతున్నాయి. కథలోని మానసిక సంఘర్షణలను, పాత్రల ప్రయాణాన్ని ఆసక్తికరంగా ఆవిష్కరించిన విధానం ట్రైలర్‌లో కనిపిస్తోంది. ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా పక్కా హాలీవుడ్ బొమ్మలా కనిపిస్తుంది. దీపా థామస్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వికాస్ ముప్పాల, బాల పరాశర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, మాస్టర్ కిరణ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 3 న విడుదల కానున్న ఈ చిత్రాన్ని చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర సంయుక్తంగా నిర్మించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!