

గత కొంతకాలంగా టాలీవుడ్ నుంచి భారీ పాన్ ఇండియా విజయం కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ‘పుష్ప 2’ తర్వాత ఆ స్థాయిలో మరో సినిమా రాకపోవడంతో అభిమానుల్లో నిరాశ కనిపిస్తోంది. ఈ ఏడాది విడుదలైన ‘పెద్ది’ ప్రాంతీయ మార్కెట్‌కే పరిమితమవగా, శాండిల్‌వుడ్ నుంచి వచ్చిన ‘టాక్సిక్’ కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. అయితే 2027 మాత్రం భారీ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద కొత్త సందడి తీసుకురాబోతోందనే అంచనాలు పెరుగుతున్నాయి.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘డ్రాగన్’, ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’, ‘ఫౌజీ’, రాజమౌళి, మహేష్ బాబు కలయికలో వస్తున్న ‘వారణాసి’ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సినిమాలన్నీ భారీ స్థాయిలో రూపొందుతుండటంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా స్టార్ హీరోల చిత్రాలు ఒకే ఏడాది వరుసగా విడుదల కావడం ప్రత్యేకంగా మారనుంది. సాధారణంగా భారీ సినిమాల మధ్య 3 నుంచి 4 నెలల విరామం ఉండేలా చూస్తారు. కానీ 2027లో మాత్రం 2 నెలలకో భారీ చిత్రం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తరాది, విదేశీ మార్కెట్లలోనూ ఈ సినిమాల సందడి ఉండనుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!