

నితీష్ తివారీ తెరకెక్కించిన ‘రామాయణ’ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లు సాధిస్తూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. విడుదలకు ముందు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ఈ చిత్రం, థియేటర్లలో మాత్రం ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా కథను సహజంగా తెరకెక్కించడం, అద్భుతమైన దృశ్యాలు, పోరాట ఘట్టాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారాయి. చివర్లో రావణుడు, జటాయువు మధ్య వచ్చే యుద్ధ సన్నివేశం చిన్నారులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తొలి వారంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలవడం విశేషం.
ఈ విజయం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’కి కూడా కలిసొచ్చే అంశంగా మారింది. ఈ సినిమాలో రామాయణానికి సంబంధించిన ప్రత్యేక ఘట్టం 30 నిమిషాలకు పైగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. గతంలో విడుదలైన ప్రత్యేక చిత్రణలోనే ఆ సన్నివేశాలకు సంబంధించిన కొన్ని దృశ్యాలు చూపించడంతో అంచనాలు పెరిగాయి. ‘రామాయణ’కు ప్రేక్షకులు ఇస్తున్న ఆదరణతో ఇతిహాస కథలపై మరోసారి ఆసక్తి పెరిగింది. అలాంటి నేపథ్యంలో రాజమౌళి తనదైన శైలిలో యుద్ధ ఘట్టాలను చూపిస్తే అంచనాలు మరింత పెరగడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!