

‘వాల్తేరు వీరయ్య’ ఘన విజయానంతరం మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మెగా158 (వర్కింగ్ టైటిల్)పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవల పొల్లాచ్చిలో జరిగిన కీలక షెడ్యూల్‌లో చిరంజీవిపై భారీ యాక్షన్ సన్నివేశాలు, ముఖ్యమైన టాకీ పార్ట్‌ను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్‌కు సంబంధించిన గ్లింప్స్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.
ప్రస్తుతం చిత్రబృందం హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించింది. వినూత్నమైన ఊరగాయల తయారీ నేపథ్యంతో రూపొందించిన లొకేషన్‌లో చిరంజీవి, ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. చిరంజీవి రెండు భిన్న కోణాలున్న పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో బాబీ మార్క్ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం చిరంజీవి కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని చిత్రబృందం విశ్వాసం వ్యక్తం చేస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!