6, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘కేసరి 2’ ప్రమోషన్లలో నాకు అన్యాయం జరిగింది- రెజీనా కసాండ్రా

Writer: Chandrika 12:32 PM, 6 నవంబర్, 2026
‘కేసరి 2’ ప్రమోషన్లలో నాకు అన్యాయం జరిగింది- రెజీనా కసాండ్రా

సినిమా పరిశ్రమలో మహిళా నటుల పట్ల వివక్ష చూపుతున్నారనే చర్చ నడుస్తున్న వేళ నటి రెజీనా కసాండ్రా తనకు ఎదురైన అనుభవాన్ని వెల్లడించారు. కరణ్‌ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్‌ నిర్మించిన ‘కేసరి 2’లో అక్షయ్‌ కుమార్‌ భార్యగా కీలక పాత్ర పోషించినప్పటికీ.. సినిమా ప్రమోషన్లలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపించారు. ఇటీవల జాన్వీ కపూర్‌ దక్షిణాది చిత్ర పరిశ్రమలో తన అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు తగిన అవకాశం లభించలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన నేపథ్యంలో రెజీనా స్పందించారు. ధర్మ ప్రొడక్షన్స్‌ సినిమాలో తనకు జరిగిన అన్యాయంపై ఎవరు మాట్లాడతారని ప్రశ్నించారు.

‘కేసరి 2’ నుంచి విడుదలైన ఓ పాటలో మొదటి నుంచి చివరి వరకు తానే కనిపించినప్పటికీ.. సోషల్‌ మీడియాలో తనను కనీసం ట్యాగ్‌ కూడా చేయలేదని రెజీనా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ధర్మ ప్రొడక్షన్స్‌ నుంచి ఇప్పటివరకు ఎలాంటి వివరణ రాలేదన్నారు. బాలీవుడ్‌లో దక్షిణాది నటుల పట్ల వివక్ష ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఉత్తరాదిలో తనను ప్రధానంగా దక్షిణాది నటిగానే గుర్తిస్తారని, దీనివల్ల తగిన ప్రాధాన్యత దక్కడం లేదని పేర్కొన్నారు. తమిళం కంటే హిందీ బాగా వచ్చినప్పటికీ ప్రాంతీయ గుర్తింపు కారణంగా వివక్ష ఎదురవుతోందన్నారు. పరిశ్రమలో మహిళా నటులు తమ అనుభవాలను ధైర్యంగా బయటపెట్టాలని సూచించిన రెజీనా.. ఈ అంశాన్ని ఉత్తరాది, దక్షిణాది వివాదంగా మార్చవద్దని కోరారు. అలాంటి చర్చలు ప్రాంతీయ విభేదాలను మరింత పెంచుతాయని అభిప్రాయపడ్డారు. జాన్వీ కపూర్‌, రాధికా ఆప్టే తమ అనుభవాలను వెల్లడించడాన్ని తాను అర్థం చేసుకోగలనని చెప్పారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓర్పు, కృతజ్ఞతకు ప్రతీకగా మలైకా అరోరా కొత్త టాటూ

ఓర్పు, కృతజ్ఞతకు ప్రతీకగా మలైకా అరోరా కొత్త టాటూ

రామాయణం కోసం రణ్‌బీర్‌ కష్టం.. భర్తపై అలియా భట్ ప్రశంసలు

రామాయణం కోసం రణ్‌బీర్‌ కష్టం.. భర్తపై అలియా భట్ ప్రశంసలు

‘రామాయణ’పై రాజమౌళి ప్రశంసలు

‘రామాయణ’పై రాజమౌళి ప్రశంసలు

జైలర్ 2 విజయం తర్వాత మరో తమిళ సినిమాపై నాగవంశీ కన్ను?

జైలర్ 2 విజయం తర్వాత మరో తమిళ సినిమాపై నాగవంశీ కన్ను?

విమర్శల నుంచి ప్రశంసలు.. యష్ కంబ్యాక్ అదుర్స్!

విమర్శల నుంచి ప్రశంసలు.. యష్ కంబ్యాక్ అదుర్స్!

రాజమౌళికి పోటీగా నితేష్ తివారీ విజన్?

రాజమౌళికి పోటీగా నితేష్ తివారీ విజన్?

ట్యాగ్లు
రెజీనా కసాండ్రాకేసరి 2ధర్మ ప్రొడక్షన్స్కరణ్ జోహార్జాన్వీ కపూర్రాధికా ఆప్టేఅక్షయ్ కుమార్బాలీవుడ్దక్షిణాది నటులుసినీ పరిశ్రమలో వివక్ష
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బాక్సాఫీస్ వద్ద ఆదర్శ కుటుంబానికి ఎదురుదెబ్బ
గాసిప్స్

బాక్సాఫీస్ వద్ద ఆదర్శ కుటుంబానికి ఎదురుదెబ్బ

జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే మెంతుల ప్యాక్ వాడండి.. నిపుణుల సూచనలు!
ఆరోగ్యం

జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే మెంతుల ప్యాక్ వాడండి.. నిపుణుల సూచనలు!

ట్రంప్ కీలక నిర్ణయాలకు డెమొక్రాట్ల అడ్డంకులు: శశి థరూర్
రాజకీయాలు

ట్రంప్ కీలక నిర్ణయాలకు డెమొక్రాట్ల అడ్డంకులు: శశి థరూర్

పేదలకు ఇళ్ల స్థలాలిచ్చి వదిలేశారు.. చిట్టడవిగా మారిన జగనన్న కాలనీ
జనరల్

పేదలకు ఇళ్ల స్థలాలిచ్చి వదిలేశారు.. చిట్టడవిగా మారిన జగనన్న కాలనీ

సూర్య కొత్త సినిమాలో ఆసక్తికరమైన లుక్
గాసిప్స్

సూర్య కొత్త సినిమాలో ఆసక్తికరమైన లుక్

‘కేసరి 2’ ప్రమోషన్లలో నాకు అన్యాయం జరిగింది- రెజీనా కసాండ్రా
సినిమాలు

‘కేసరి 2’ ప్రమోషన్లలో నాకు అన్యాయం జరిగింది- రెజీనా కసాండ్రా

చికెన్‌తో శెనగపప్పు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా? నిపుణులు చెబుతున్న సూచనలు!
ఆరోగ్యం

చికెన్‌తో శెనగపప్పు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా? నిపుణులు చెబుతున్న సూచనలు!

భారత్‌-న్యూజిలాండ్‌ రెండో వన్డేపై వర్షం నీడ..
క్రీడలు

భారత్‌-న్యూజిలాండ్‌ రెండో వన్డేపై వర్షం నీడ..

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో దీపావళి జరుపుకోండి.. కాంగ్రెస్ శ్రేణులకు మహేశ్ గౌడ్ పిలుపు
జనరల్

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో దీపావళి జరుపుకోండి.. కాంగ్రెస్ శ్రేణులకు మహేశ్ గౌడ్ పిలుపు

తమిళ జాలర్ల మృతి ఘటనపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
జనరల్

తమిళ జాలర్ల మృతి ఘటనపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

రాహుల్ గాంధీ ఆహ్వానాన్ని తిరస్కరించిన సిద్ధరామయ్య
రాజకీయాలు

రాహుల్ గాంధీ ఆహ్వానాన్ని తిరస్కరించిన సిద్ధరామయ్య

కేకేఆర్‌లో ఎదురైన చేదు అనుభవాలను గుర్తుచేసుకున్న అయ్యర్‌
క్రీడలు

కేకేఆర్‌లో ఎదురైన చేదు అనుభవాలను గుర్తుచేసుకున్న అయ్యర్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!