

మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా తన రాబోయే ప్రాజెక్టులపై ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడిస్తూ, ఏకంగా ఏడు చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలిపారు. ఉత్కంఠభరితమైన కథలు, విభిన్న ప్రయాణాలు, ప్రతిభావంతులైన దర్శకులతో కలిసి పనిచేస్తున్నానని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులకు ప్రియదర్శన్, దిలీశ్ పోతన్, సత్యన్ అంతికాడ్, జీతూ జోసెఫ్, విష్ణు మోహన్, అనూప్ సత్యన్, జూడ్ ఆంథోనీ జోసెఫ్ దర్శకత్వం వహించనున్నారు.
అయితే ఈ ఏడు చిత్రాల్లో ఏ సినిమా ముందుగా సెట్స్‌పైకి వెళ్తుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఇప్పటికే ఈ ఏడాది ‘తుడక్కం’, ‘దృశ్యం 3’ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన మోహన్‌లాల్, ఇకపై వరుస ప్రాజెక్టులతో మరింత సందడి చేయనున్నారు. విభిన్న కథాంశాలు, ప్రముఖ దర్శకుల కాంబినేషన్లతో తెరకెక్కనున్న ఈ సినిమాలపై మోహన్‌లాల్ అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!