

ప్రముఖ బైక్ రైడర్, సాహస యాత్రికుడు భరద్వాజ్ దయాళ్ దర్శకుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాంకేతికతను ఉపయోగిస్తూ హైబ్రిడ్ టెక్నాలజీ విధానంలో ‘కిరి కిరి’ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రవికాంత్ వీరేపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిర్మాత దిల్‌రాజు క్లాప్ కొట్టి ఆదివారం ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించారు. హైదరాబాద్ నేపథ్యంలో కథ సాగుతుందని, వినూత్న సాంకేతికతతో సినిమాను రూపొందిస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.
ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ.. హైబ్రిడ్ టెక్నాలజీతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆరు నెలల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ కొత్త ప్రయోగం విజయవంతమై ప్రపంచ సినిమా రంగానికి ఓ గొప్ప ముందడుగుగా నిలవాలని ఆకాంక్షించారు. మరోవైపు, ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే ఆందోళనలు ఉన్నప్పటికీ, కొత్త సాంకేతికత అనేక అవకాశాలను సృష్టిస్తుందని దర్శకుడు భరద్వాజ్ దయాళ్ పేర్కొన్నారు. ఏఐ సాయంతో తక్కువ సమయంలో నాణ్యమైన చిత్రాన్ని రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!