
జనరల్

'లెనిన్' చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి మద్దతు తెలపడంతో నటుడు నాగార్జున అక్కినేని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. "ధన్యవాదాలు చిరంజీవి గారు. నా కుటుంబానికి, నాకు మీరు ఎప్పుడూ అండగా నిలిచారు. సినిమా చూడండి... మీకు తప్పకుండా నచ్చుతుంది" అంటూ నాగార్జున సోషల్ మీడియాలో స్పందించారు. ఈ పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
అదే సమయంలో అఖిల్ అక్కినేని కూడా స్పందిస్తూ, "పెదనాన్న... మీ ప్రేమ ఎప్పుడూ అమూల్యమైనది. మీ సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు" అని పేర్కొన్నారు. మురళీ కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన లెనిన్ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!