

సూర్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘సీన్’ సినిమా రేపు పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంతో సూర్య వరుసగా హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. జితు మాధవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నజ్రియా ఫహాద్ కథానాయికగా నటించారు. కేరళలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న నజ్రియా.. సూర్యతో కలిసి నటించే అవకాశం వచ్చిన మూడు సినిమాలను మిస్ చేసుకోవడంపై స్పందించారు. తాను ఆ సినిమాలను తిరస్కరించలేదని, తేదీలు కుదరకపోవడం, ఇతర షెడ్యూల్ సమస్యల కారణంగానే వాటిలో నటించలేకపోయానని స్పష్టం చేశారు.
తమిళ సినిమాకు తిరిగి రావడానికి 12 ఏళ్లు ఎందుకు పట్టిందో కూడా నజ్రియా వివరించారు. సరైన కథ కోసం ఎదురుచూశానని, ‘సీన్’ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలోకి తిరిగి రావడం ఆనందంగా ఉందని తెలిపారు. అలాగే దర్శకుడు జితు మాధవన్‌తో కలిసి పనిచేస్తున్న తొలి కథానాయిక కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. విడుదలకు ముందు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఓ మోస్తరు అంచనాలు నెలకొన్నాయి. అయితే ‘రామాయణం’ కారణంగా థియేటర్లలో స్క్రీన్ల కొరత ఏర్పడితే ‘సీన్’ సినిమా వసూళ్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి ఎలాంటి స్పందన వస్తుంది, సూర్యకు హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తుందా అనేది చూడాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!