
జనరల్

‘స్పిరిట్’ సినిమాలో దక్షిణ కొరియా స్టార్ నటుడు డాన్ లీని తీసుకునే ఆలోచన తమకు వచ్చినట్లు చిత్ర నిర్మాత ప్రణయ్ రెడ్డి తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన హైప్‌ను చూసిన తర్వాత ఆయనను నటింపజేయడంపై చర్చించామని చెప్పారు. అయితే డాన్ లీని తీసుకోకపోవడానికి బడ్జెట్ కారణం కాదని స్పష్టం చేశారు. సినిమా కథకు ఉన్న హైదరాబాద్ లోకల్ సెట్టింగ్‌లో దక్షిణ కొరియా నటుడు సహజంగా సరిపోరని భావించి ఆ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
అదేవిధంగా నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ప్రణయ్ రెడ్డి తెలిపారు. దీంతో ‘స్పిరిట్’ సినిమాలో డాన్ లీ, ప్రకాశ్ రాజ్ కనిపించరనే విషయంపై నిర్మాత స్పష్టత ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు సినిమాపై నెలకొన్న ఆసక్తి, సోషల్ మీడియా చర్చలకు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!