
టెక్నాలజీ

తెలుగులో విజయవంతమైన ఫ్రాంచైజీల్లో ఒకటైన పొలిమేర నుంచి మూడో భాగం ప్రారంభమైంది. ఇప్పటికే రెండు చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సిరీస్‌లో పొలిమేర 3 సోమవారం ప్రారంభమైంది. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో నటించనున్నారు. ఇటీవల బ్లాస్ట్ జోన్ చిత్రంతో విజయాన్ని అందుకున్న ఆయన, ఈ సినిమాలో శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు.
డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సత్యం రాజేశ్, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య, రాకేందు మౌళి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వంశీ నందిపాటి, జాన్వీ నారంగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రారంభ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇవ్వగా, డి. సురేశ్‌బాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!