

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ, రాజ్యాంగ స్ఫూర్తితోనే తన విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగంలోని 21, 48ఏ అధికరణాల ప్రకారం ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కుల పరిరక్షణకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. గత రెండేళ్లలో మార్కెట్ విలువ సుమారు రూ.1.50 లక్షల కోట్లుగా ఉన్న ప్రభుత్వ ఆస్తులను రక్షించామని, ఆరు చెరువులను పూర్తిస్థాయిలో పునరుద్ధరించామని తెలిపారు. మరో 20 చెరువుల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
భూ ఆక్రమణదారులు, ల్యాండ్ మాఫియాలు తప్పుడు సమాచారంతో న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఏవీ రంగనాథ్ ఆరోపించారు. హైడ్రా చర్యలను అడ్డుకునేందుకు తనపై 63 కోర్టు ధిక్కరణ కేసులు దాఖలయ్యాయని, వాటిని చట్టపరంగానే ఎదుర్కొంటానని తెలిపారు. ప్రభుత్వ బాధ్యతలను నిజాయితీ, నిబద్ధతతో నిర్వహించడం తన లక్ష్యమని, భవిష్యత్తులో కూడా అదే విధంగా పనిచేస్తానని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!