

అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రాకా’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వీరిద్దరి కలయికలో వస్తున్న తొలి సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే ఆసక్తి నెలకొంది. ఇందులో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె కీలక పాత్రలో నటిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ కూడా సినిమాలో భాగమయ్యారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో నటిస్తున్న పృథ్వీరాజ్ అలియాస్ బబ్లూ తన పాత్రకు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్‌లో తనకు ప్రత్యేకమైన లుక్‌తో కూడిన కీలక పాత్ర దక్కిందని తెలిపారు. దర్శకుడు అట్లీతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని, అల్లు అర్జున్‌తో కలిసి నటించే అవకాశం రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. భారీ యాక్షన్ అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పాత్రలు, కథాంశం తదితర వివరాలను మేకర్స్ ఇంకా గోప్యంగా ఉంచుతున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!