

ఒకే పాత్రలో ఐదు విభిన్న కోణాలు.. వయసుకు తగ్గ శరీర భాష.. శ్రీకాకుళం యాసలో సహజమైన సంభాషణలు.. ఇలా తన నటనతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతున్నారు నటుడు రాగ్ మయూర్. ‘గరివిడి లక్ష్మి’ సినిమాలో సత్తిబాబు పాత్రలో ఆయన కనిపిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారుతోంది. పాత్రకు అనుగుణంగా తన హావభావాలు, మాటతీరు, శరీర భాషను మార్చుకుంటూ రాగ్ మయూర్ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
తెలుగు సినిమాల్లో హీరోల ప్రతిభను కేవలం రూపం, స్టైల్, మాస్ ఇమేజ్‌తో మాత్రమే అంచనా వేయలేం. విభిన్నమైన పాత్రలను ఎంచుకుని, వాటిలోని భావోద్వేగాలను సహజంగా తెరపై ఆవిష్కరించగలగడం కూడా నటుడి సామర్థ్యానికి నిదర్శనం. ఇప్పటివరకు తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న రాగ్ మయూర్.. ‘గరివిడి లక్ష్మి’లో సత్తిబాబు పాత్ర ద్వారా తనలోని మరో కోణాన్ని చూపిస్తున్నారు. పాత్రలోని ఐదు విభిన్న ఛాయలను, వయసుకు తగ్గ మార్పులను ఆయన ఎలా ప్రదర్శించారన్న అంశం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!