

ప్రకటించిన దాదాపు రెండేళ్ల ఏడు నెలల తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న అత్యంత ఆసక్తికరమైన చిత్రం ఆర్సీ 17 ఎట్టకేలకు హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంఛనంగా మొదలైంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, సుకుమార్ దంపతులతో పాటు నిర్మాతలు రవిశంకర్, నవీన్ యెర్నేని, నాగవంశీ, రాహుల్ సంకృత్యన్, గోపీచంద్ మలినేని, మారుతి, బుచ్చిబాబు సానా, వంశీ నందిపాటి, హరీశ్ శంకర్ తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు. పూజా కార్యక్రమం విజయవంతంగా పూర్తవడంతో అభిమానులు సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఫస్ట్ లుక్ ఎప్పుడు విడుదలవుతుంది? అనే విషయాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమాకు రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చనున్నారు. మిగిలిన నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, టీ-సిరీస్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. గతంలో రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ 'రంగస్థలం' తర్వాత వీరిద్దరూ మళ్లీ కలుస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తారో చూడాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!