12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తన ఫిట్‌నెస్ రహస్యాన్ని బయటపెట్టిన రామ్ చరణ్ సతీమణి

Writer: Pooja 08:55 PM, 12 సెప్టెంబర్, 2026
తన ఫిట్‌నెస్ రహస్యాన్ని బయటపెట్టిన  రామ్ చరణ్ సతీమణి

ప్రముఖ వ్యాపారవేత్త, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తన ఫిట్‌నెస్ ప్రయాణం, బరువు తగ్గే క్రమంలో ఎదుర్కొన్న సవాళ్లు, తనపై వచ్చిన విమర్శల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అమెరికాలో చదువుకునే సమయంలో కుటుంబానికి దూరంగా ఉండటం వల్ల ఒత్తిడికి గురయ్యానని, ఆ సమయంలో ఎక్కువగా తినడంతో 18 ఏళ్ల వయసులో 95 కిలోల బరువు పెరిగానని తెలిపారు. ఆ తర్వాత పలువురు ఆహార నిపుణులను సంప్రదించి, వివిధ రకాల ఆహార నియమాలను పాటించినట్లు చెప్పారు. చివరికి అన్నం, గోధుమలకు బదులుగా ఓట్స్, అధిక మాంసకృత్తులు ఉన్న ఆహారం తీసుకోవడంతో మంచి ఫలితం కనిపించిందన్నారు. ప్రతిరోజూ సుమారు 10 వేల అడుగులు నడవడం కూడా అలవాటు చేసుకున్నానని తెలిపారు.

రామ్ చరణ్‌తో వివాహం జరిగిన సమయంలోనూ తన బరువుపై తీవ్ర విమర్శలు వచ్చాయని ఉపాసన చెప్పారు. తొలినాళ్లలో ఆ వ్యాఖ్యలు తనను బాధించాయని, అయితే వాటి కారణంగానే మానసికంగా మరింత దృఢంగా మారానని పేర్కొన్నారు. ప్రస్తుతం విమర్శలను ఎలా ఎదుర్కోవాలో తనకు బాగా తెలుసన్నారు. అలాగే తాను నిద్రలేమితో బాధపడుతున్నట్లు వెల్లడించిన ఉపాసన, తనకు, తన తల్లికి రోజుకు నాలుగు గంటలకు మించి నిద్ర పట్టదని చెప్పారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని త్వరలో నిద్ర సంబంధిత వైద్య కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. జీవనశైలి మార్పు పూర్తిగా మనస్తత్వంపై ఆధారపడి ఉంటుందని అన్నారు. మానసిక ప్రశాంతత కోసం చరణ్‌తో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటానని, దీపక్ చోప్రా కోర్సులు, సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రవచనాలు వింటానని చెప్పారు. చరణ్‌తో కలిసి వ్యాయామాలు చేస్తూ, కొత్త ఆహార నియమాలను పాటిస్తున్నట్లు తెలిపారు. ఈ దంపతులకు మూడేళ్ల కుమార్తె క్లీంకారతో పాటు, 2026 జనవరిలో శివరామ్, అన్వీరా దేవి అనే కవలలు జన్మించిన సంగతి తెలిసిందే.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అనుపమ క్రేజీ క‌ళ్యాణం నుంచి మాస్ సాంగ్ విడుదల

అనుపమ క్రేజీ క‌ళ్యాణం నుంచి మాస్ సాంగ్ విడుదల

సూరితో విభేదాలపై విష్ణు విశాల్ క్లారిటీ

సూరితో విభేదాలపై విష్ణు విశాల్ క్లారిటీ

ఇప్పటికీ తన నటనపై సందేహం వస్తుందంటున్న ప్రీతి జింటా

ఇప్పటికీ తన నటనపై సందేహం వస్తుందంటున్న ప్రీతి జింటా

ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’ విడుదల - నాని

ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’ విడుదల - నాని

‘ఆదర్శ కుటుంబం – ఏకే 47’ టీజర్‌తో వెంకీ సందడి

‘ఆదర్శ కుటుంబం – ఏకే 47’ టీజర్‌తో వెంకీ సందడి

ట్యాగ్లు
ఉపాసన కొణిదెలరామ్ చరణ్ఉపాసన ఫిట్‌నెస్ఫిట్‌నెస్ ప్రయాణంనిద్ర సమస్యసినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
‘డీసీ’ సక్సెస్ సెలబ్రేషన్స్‌- హీరోయిన్ను గుర్తించరా అని విమర్శలు

‘డీసీ’ సక్సెస్ సెలబ్రేషన్స్‌- హీరోయిన్ను గుర్తించరా అని విమర్శలు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సెన్సార్ అభ్యంతరాలతో ‘సీక్రెట్ సోల్జర్’కు కొత్త టైటిల్
సినిమాలు

సెన్సార్ అభ్యంతరాలతో ‘సీక్రెట్ సోల్జర్’కు కొత్త టైటిల్

‘స్వయంభు’పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నిఖిల్
సినిమాలు

‘స్వయంభు’పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నిఖిల్

జైలర్ 2 సెన్సార్‌పై రజనీకాంత్ అసంతృప్తి?
గాసిప్స్

జైలర్ 2 సెన్సార్‌పై రజనీకాంత్ అసంతృప్తి?

కోలీవుడ్ హీరోతో రమేష్ వర్మ కొత్త సినిమా
సినిమాలు

కోలీవుడ్ హీరోతో రమేష్ వర్మ కొత్త సినిమా

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పవన్ కీలక అడుగులు
జనరల్

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పవన్ కీలక అడుగులు

అనుపమ క్రేజీ క‌ళ్యాణం నుంచి మాస్ సాంగ్ విడుదల
సినిమాలు

అనుపమ క్రేజీ క‌ళ్యాణం నుంచి మాస్ సాంగ్ విడుదల

హమ్జా బిన్ లాడెన్ వీడియోతో మళ్లీ కలకలం
జనరల్

హమ్జా బిన్ లాడెన్ వీడియోతో మళ్లీ కలకలం

లాల్‌బాగ్‌చా రాజా వినాయక ఉత్సవాల్లో గ్రీన్ పవర్ ప్లాన్
జనరల్

లాల్‌బాగ్‌చా రాజా వినాయక ఉత్సవాల్లో గ్రీన్ పవర్ ప్లాన్

తన ఫిట్‌నెస్ రహస్యాన్ని బయటపెట్టిన  రామ్ చరణ్ సతీమణి
సినిమాలు

తన ఫిట్‌నెస్ రహస్యాన్ని బయటపెట్టిన రామ్ చరణ్ సతీమణి

విశాఖ భవిష్యత్ నీటి అవసరాలకు భారీ ప్రణాళిక
జనరల్

విశాఖ భవిష్యత్ నీటి అవసరాలకు భారీ ప్రణాళిక

నల్లధనం ఆరోపణలపై జేపీసీ విచారణకు కాంగ్రెస్ డిమాండ్
జనరల్

నల్లధనం ఆరోపణలపై జేపీసీ విచారణకు కాంగ్రెస్ డిమాండ్

సూరితో విభేదాలపై విష్ణు విశాల్ క్లారిటీ
సినిమాలు

సూరితో విభేదాలపై విష్ణు విశాల్ క్లారిటీ