
సినిమాలు

పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడంపై రేగిన విమర్శలు డబ్బిచ్చి చేయించినవి అని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఈ-100తో నడిచే ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలకు అనుమతిస్తూ కేంద్ర మోటారు వాహనాల నిబంధనల్లో మార్పులు చేసిన ఒక రోజు తర్వాత గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఢిల్లీలో సీఐఐ నిర్వహించిన సదస్సులో గడ్కరీ మాట్లాడుతూ.. ‘‘ఈ-20కి వ్యతిరేకంగా మూడు నెలల క్రితం పెద్దఎత్తున గళాలు విప్పారు. ఇప్పుడు అవి ఆగిపోయాయి. అదంతా డబ్బిచ్చి చేసిన దుష్ప్రచారం’’ అన్నారు. గత మూడేళ్ల నుంచి కోట్ల కొద్దీ వాహనాలు ఈ-19, ఈ-20 పెట్రోల్ వినియోగిస్తున్నా, ఎలాంటి దుష్ప్రభావాలు కనపడలేదన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!