28, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పోలింగ్ రోజున పులివెందులలో ఉంటా. భయపడొద్దు. వైఎస్ జగన్

Writer: Chandrika 08:20 AM, 28 అక్టోబర్, 2026
పోలింగ్ రోజున పులివెందులలో ఉంటా. భయపడొద్దు. వైఎస్  జగన్

"ఈ రెండేళ్లు ఓపిక పట్టండి.. వచ్చేది జగన్‌ 2.0" అని పార్టీ శ్రేణులకు వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చారు. పులివెందులలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన ఆయన... అధికార కూటమిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పులివెందుల నుంచి మొదలయ్యే ధ్వని రాష్ట్రమంతా వినిపించాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని తుడిచిపెట్టేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

నామినేషన్ల ప్రక్రియలో అడుగడుగునా అక్రమాలు జరిగాయని జగన్ ఆరోపించారు. "కూటమి నేతలే 17 మున్సిపాలిటీలు ఏకగ్రీవమని ప్రకటించుకున్నారు. నా సొంత నియోజకవర్గమైన పులివెందులలోనే కేవలం 20 వార్డుల్లో నామినేషన్లు వేయగలిగాం. 7 జడ్పీటీసీ స్థానాలకు గాను 4 చోట్ల మాత్రమే పోటీ జరుగుతోంది. స్క్రూటినీ పేరిట 2 మండలాల్లో మా నామినేషన్లను అన్యాయంగా తిరస్కరించారు" అని దుయ్యబట్టారు.కార్యకర్తలంతా ధైర్యంగా ఉండాలని, వారికి తాను అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజున తాను స్వయంగా పులివెందులలోనే ఉంటానని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని అన్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని... మీ అన్న మీకు తోడుగా ఉంటాడని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. 

"మా టైమ్ వచ్చినప్పుడు, చట్టాన్ని అతిక్రమించి అన్యాయం చేసిన ఏ అధికారినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వారు సర్వీసులో ఉన్నా, ఒకవేళ రిటైర్ అయిపోయినా సరే.. ఎక్కడున్నా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టి చర్యలు తీసుకుంటాం. వడ్డీతో సహా చెల్లించేలా చేస్తాం" అని తీవ్రంగా హెచ్చరించారు. పులివెందులలో తమ కార్యకర్తలపై చేయి వేస్తే, తనపై చేయి వేసినట్లేనని ఆయన స్పష్టం చేశారు. "మన హక్కులు మనమే కాపాడుకోవాలి. తిరగబడండి" అని పిలుపునిచ్చారు.

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అధికార కూటమి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. "ఎన్నికల్లో 50 శాతం సీట్లలో పోటీ చేస్తున్నది మా అక్కచెల్లెమ్మలే. వారి నామినేషన్లను నడిరోడ్డుపై అడ్డుకుంటున్నారు. అక్కచెల్లెమ్మల చీరలు చించి దాడులు చేశారు. ఇలా చేయడానికి మీకు సిగ్గుందా? వైసీపీ హయాంలోనే మహిళలకు నిజమైన న్యాయం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న పనులకు ఆయనే సిగ్గుతో తలదించుకోవాలి" అని మండిపడ్డారు. 

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జ్ఞానేశ్‌ తప్పుకోవాలి.. లేదంటే తప్పించాలి – రాహుల్‌గాంధీ

జ్ఞానేశ్‌ తప్పుకోవాలి.. లేదంటే తప్పించాలి – రాహుల్‌గాంధీ

ఈ20పై డబ్బిచ్చి దుష్ప్రచారం చేయించారు – నితిన్ గడ్కరీ

ఈ20పై డబ్బిచ్చి దుష్ప్రచారం చేయించారు – నితిన్ గడ్కరీ

కర్ణాటకలో కోటి ఓట్లు గల్లంతు!

కర్ణాటకలో కోటి ఓట్లు గల్లంతు!

ఇజ్రాయెల్ ఎన్నికల్లో హంగ్: నెతన్యాహుకు షాక్

ఇజ్రాయెల్ ఎన్నికల్లో హంగ్: నెతన్యాహుకు షాక్

ఏపీలో జడ్పీటీసీ ఏకగ్రీవాల్లో కూటమి జోరు..

ఏపీలో జడ్పీటీసీ ఏకగ్రీవాల్లో కూటమి జోరు..

దేవరకద్రలో ఎండిన వరి పంటల పరిశీలన..

దేవరకద్రలో ఎండిన వరి పంటల పరిశీలన..

ట్యాగ్లు
ఏపీలోకల్ బాడీ ఎన్నికలువైఎస్ ఆర్ సీపీవైఎస్ జగన్పులివెందులకడపటీడీపీబీజేపీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్టాక్ మార్కెట్‌లోకి జియో ప్లాట్‌ఫామ్స్
బిజినెస్

స్టాక్ మార్కెట్‌లోకి జియో ప్లాట్‌ఫామ్స్

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చేపలను ఆహారంలో చేర్చుకోండి.. వైద్యుల సూచనలు!
ఆరోగ్యం

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చేపలను ఆహారంలో చేర్చుకోండి.. వైద్యుల సూచనలు!

నా బయోపిక్ నిజం కాదు. అసలు కథ వేరు – మేరీ కోమ్
క్రీడలు

నా బయోపిక్ నిజం కాదు. అసలు కథ వేరు – మేరీ కోమ్

నెట్‌ఫ్లిక్స్‌లోకి ఫహాద్ ఫాజిల్ ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ

నెట్‌ఫ్లిక్స్‌లోకి ఫహాద్ ఫాజిల్ ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు కోల్ ఇండియా బొగ్గు సరఫరా..
జనరల్

యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు కోల్ ఇండియా బొగ్గు సరఫరా..

అనిరుధ్‌-కావ్య రిసెప్షన్‌ కార్డు  వైరల్‌!
సినిమాలు

అనిరుధ్‌-కావ్య రిసెప్షన్‌ కార్డు వైరల్‌!

తెలంగాణలో 365 మండలాల్లో కరవు..
జనరల్

తెలంగాణలో 365 మండలాల్లో కరవు..

జ్ఞానేశ్‌ తప్పుకోవాలి.. లేదంటే తప్పించాలి – రాహుల్‌గాంధీ
రాజకీయాలు

జ్ఞానేశ్‌ తప్పుకోవాలి.. లేదంటే తప్పించాలి – రాహుల్‌గాంధీ

ఈ20పై డబ్బిచ్చి దుష్ప్రచారం చేయించారు – నితిన్ గడ్కరీ
రాజకీయాలు

ఈ20పై డబ్బిచ్చి దుష్ప్రచారం చేయించారు – నితిన్ గడ్కరీ

పోలింగ్ రోజున పులివెందులలో ఉంటా. భయపడొద్దు. వైఎస్  జగన్
రాజకీయాలు

పోలింగ్ రోజున పులివెందులలో ఉంటా. భయపడొద్దు. వైఎస్ జగన్

జర్నలిజానికి డేటా చట్టం ముప్పు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన మీడియా సంస్థలు
జనరల్

జర్నలిజానికి డేటా చట్టం ముప్పు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన మీడియా సంస్థలు

దేశవ్యాప్తంగా తగ్గిపోతున్న ఇళ్ల విక్రయాలు
జనరల్

దేశవ్యాప్తంగా తగ్గిపోతున్న ఇళ్ల విక్రయాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!