

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ చిత్రం ‘రామాయణ’పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు నితీష్ తివారి రూపొందిస్తున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. భారతీయ ఇతిహాసాన్ని అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరువ చేయాలనే లక్ష్యంతో చిత్రబృందం ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తాజాగా ‘రామాయణ’ ట్రైలర్‌ను ఇంగ్లీష్ వెర్షన్‌లో విడుదల చేయడం విశేషంగా మారింది.
ఈ ఇంగ్లీష్ ట్రైలర్‌లో ఏఐ సాంకేతికతను ఉపయోగించి నటీనటుల లిప్ సింక్‌ను ఇంగ్లీష్‌కు అనుగుణంగా రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 6న ‘రామాయణ’ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. హాలీవుడ్ సంగీత దిగ్గజం హన్స్ జిమ్మర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. అత్యాధునిక సాంకేతికతతో భారతీయ పురాణ కథను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!