

‘హనుమాన్’, ‘మిరాయ్’ సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో తేజ సజ్జా త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఇటీవల తన పెళ్లి విషయాన్ని స్వయంగా వెల్లడించిన ఆయన.. ప్రస్తుతం నిశ్చితార్థ వేడుకకు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి తన నిశ్చితార్థ ఆహ్వాన పత్రికను అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తనది పెద్దలు కుదిర్చిన వివాహమని తేజ సజ్జా గతంలోనే స్పష్టం చేశారు. తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించినట్లు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నవంబర్‌లో నిశ్చితార్థం, డిసెంబర్‌లో వివాహ వేడుక జరగనున్నాయి. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. దీంతో అభిమానులు తేజ సజ్జా వివాహ వేడుకల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!