
జనరల్

బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కన్నడ స్టార్ యశ్‌పై తన అభిమానాన్ని వెల్లడించారు. రామాయణ సినిమాలో రాముడు, రావణుడు ఎదురెదురుగా నిలిచే సన్నివేశాల కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. చాలా కాలంగా యశ్‌కు అభిమానినని, ఆయనతో కలిసి నటించడం తనకు ప్రత్యేకమైన అనుభూతిగా ఉందని తెలిపారు.
యశ్ రావణుడి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారని రణ్‌బీర్ ప్రశంసించారు. తనదైన స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్, నిజాయితీతో ఆ పాత్రకు ఆయన ప్రాణం పోశారని అన్నారు. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. రామాయణ తొలి భాగం ఈ ఏడాది దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!