

భారతీయ సంగీత దిగ్గజం ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవితకథ ఆధారంగా ‘ఎంఎస్ – ఏ లెగసీ ఆన్ స్క్రీన్’ పేరుతో ఓ ప్రతిష్ఠాత్మక బయోపిక్ తెరకెక్కుతోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్న ఎంఎస్ సుబ్బలక్ష్మి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమని, పాత్రకు న్యాయం చేసేందుకు కర్ణాటక సంగీతం నేర్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు రష్మిక ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
తన జీవితంలో ఇప్పటివరకు ఎప్పుడూ పాట పాడలేదని, కనీసం ఇంట్లో కూడా హమ్ చేయనని రష్మిక తెలిపారు. కేవలం పాట పాడుతున్నట్లు నటించడం తనకు ఇష్టం లేదని, ఈ పాత్ర కోసం నిజంగానే సంగీతం నేర్చుకుని పాడాలని భావిస్తున్నట్లు చెప్పారు. మొదట ఈ పాత్ర చేయగలనా అని సందేహించానని, అయితే ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమని, ఆమె గురించి భావితరాలకు తెలియజేయడం అవసరమని ఈ సవాల్‌ను స్వీకరించినట్లు వివరించారు. ఈ అవకాశం రావడం తన అదృష్టమని, పాత్ర కోసం శక్తి మేరకు కష్టపడతానని రష్మిక పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!