

హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్‌తో పాటు ఓ ప్రముఖ హోటల్‌ను పేల్చివేస్తామంటూ వచ్చిన బాంబు బెదిరింపు ఈమెయిల్‌పై పోలీసుల దర్యాప్తులో పురోగతి సాధించారు. లష్కరే తోయిబా పేరుతో నవంబర్ 21న రాత్రి 7:13 గంటలకు నగర పోలీస్ కమిషనర్‌కు ఈ మెయిల్ వచ్చినట్లు సమాచారం. ముంబై తరహా దాడులకు పాల్పడతామని అందులో హెచ్చరించినట్లు తెలుస్తోంది. నిందితుల ఆచూకీ గుర్తించకుండా ఉండేందుకు డిస్పోజబుల్ ఈమెయిల్ ఐడీని ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ బెదిరింపు నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.
సాంకేతిక ఆధారాల సాయంతో నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (వీపీఎన్), ఐపీ అడ్రస్ వివరాలను విశ్లేషిస్తున్నారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా కాచిగూడతో పాటు ఇతర రైల్వే స్టేషన్లు, నగరంలోని రద్దీ ప్రాంతాల్లో నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లను పెంచారు. బెదిరింపు ఈమెయిల్ పంపిన వ్యక్తి ఎవరు? దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!