

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో జరిగే సదస్సులో పాల్గొనేందుకు లండన్ వెళ్లాల్సిన సౌరభ్ దాస్‌ను ప్రభుత్వం అడ్డుకున్నట్లు వస్తున్న వార్తలపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే విమర్శలు గుప్పించారు. ఈ విషయంపై ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన.. ప్రతిష్ఠాత్మక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందినప్పటికీ సౌరభ్ దాస్‌ను సదస్సుకు వెళ్లకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఆక్స్‌ఫర్డ్ వంటి ప్రముఖ విద్యాసంస్థ నుంచి ఆహ్వానం రావడాన్ని చూసి అధికారంలో ఉన్నవారు అసూయపడుతున్నారేమోనంటూ ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ నేతలు తరచూ విదేశీ పర్యటనలు చేస్తుంటే, ఒక వ్యక్తి అంతర్జాతీయ సదస్సుకు వెళ్లకుండా అడ్డుకోవడం ఏమిటని అభిజీత్ దీప్కే ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలతో సౌరభ్ దాస్ విదేశీ పర్యటనకు సంబంధించిన అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అయితే, ఆయన ప్రయాణాన్ని అడ్డుకున్నారనే ఆరోపణల వెనుక ఉన్న పరిస్థితులు, ఈ వ్యవహారంపై ప్రభుత్వ వివరణ ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!