

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’ ఆగస్టు 21న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆసక్తికరమైన గ్లింప్స్, మెలోడీతో పాటు ఎనర్జిటిక్ సాంగ్స్ సినిమాకు మంచి బజ్ తీసుకొచ్చాయి. తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్‌తో ఈ అంచనాలు మరింత పెరిగాయి.
ఇటీవల జరిగిన గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ‘ఇరుముడి’లోని మోస్ట్ అవైటెడ్ ‘మల్లెపూల పల్లకి’ పాటను మేకర్స్ విడుదల చేశారు. అయ్యప్ప భక్తుల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న ఒరిజినల్ పాటలోని భక్తి భావాన్ని అలాగే ఉంచుతూ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ కొత్త మ్యూజికల్ టచ్ ఇచ్చారు. పవర్‌ఫుల్ బీట్స్, డప్పు రిథమ్స్, గ్రాండ్ ఆర్కెస్ట్రేషన్‌తో పాటను మరింత ఎనర్జిటిక్‌గా తీర్చిదిద్దారు. అయ్యప్ప భక్తుడి గెటప్‌లో కనిపించిన రవితేజ తన ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ, భారీ సంఖ్యలో భక్తులు, గ్రాండ్ విజువల్స్ పాటకు మరింత మాస్ అప్పీల్ తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ ట్రెండింగ్‌లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ ఆడియన్స్‌ను అలరిస్తోంది. థియేటర్లలో ఈ పాట మరింత వైబ్ క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!