
జనరల్

సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ నిర్మిస్తున్న 'రోమాంచకం' సినిమా గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమ, భావోద్వేగాలు, వినోదాన్ని మిళితం చేసిన యూత్‌ఫుల్ లవ్ స్టోరీగా ఈ చిత్రం రూపొందుతోంది.
గ్లింప్స్‌లో పవన్ పప్పుల అందించిన అద్భుతమైన విజువల్స్, వాసుకి వైభవ్ స్వరపరిచిన మెలోడీయస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హీరో, హీరోయిన్‌ల మధ్య ప్రేమ, వారి మధ్య ఏర్పడే భావోద్వేగ దూరాన్ని అందంగా ఆవిష్కరించిన ఈ గ్లింప్స్ ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. సుమంత్ ప్రభాస్, అనంతిక జంట కెమిస్ట్రీ కూడా సినిమాకు ప్రధాన బలంగా కనిపిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!