

పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఉన్న భారీ అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభిమానుల్లోనే కాకుండా సినీ పరిశ్రమలోని పలువురు నటీనటులు కూడా ప్రభాస్‌పై తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తుంటారు. తాజాగా ‘రోమాంచకం’ హీరో సుమంత్ ప్రభాస్ కూడా రెబల్ స్టార్‌పై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. ప్రభాస్‌తో కలిసి దిగిన ఓ ప్రత్యేక ఫొటోను పంచుకుంటూ ఆయన చేసిన సరదా వ్యాఖ్యలు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ప్రభాస్ సినిమా కోసం ఏఎంబీ లేదా ఇనార్బిట్ మాల్‌లో గురువారం సాయంత్రం 7 గంటల షోకు వెళ్లేందుకు కూడా తాను ఎప్పుడూ సిద్ధమేనని సుమంత్ ప్రభాస్ సరదాగా వ్యాఖ్యానించారు. ప్రభాస్‌పై తన అభిమానాన్ని తెలియజేస్తూ ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు అభిమాన వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోతో పాటు ఈ వ్యాఖ్యలు ప్రభాస్ క్రేజ్‌ను మరోసారి గుర్తు చేస్తున్నాయని అభిమానులు పేర్కొంటున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!