
జనరల్

వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ కాయదు లోహర్ తాజాగా ‘ఇమ్మోర్టల్’ ప్రమోషన్స్‌కు దూరంగా ఉండటంపై వచ్చిన విమర్శలు, ట్రోలింగ్‌పై స్పందించారు. జీవీ ప్రకాశ్ కుమార్, కాయదు లోహర్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ అండ్ థ్రిల్లర్ మూవీ ప్రమోషన్స్‌లో హీరోయిన్ కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో పలు రకాల చర్చలు జరిగాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాయదు ఈ విషయంపై వివరణ ఇచ్చారు. ‘ఐ యామ్ గేమ్’ ప్రమోషన్స్ కోసం తనకు ఒక్క రోజు మాత్రమే అందుబాటులో ఉండగా, అదే తేదీ ‘ఇమ్మోర్టల్’ టీమ్‌కు కూడా ఖాళీగా లేదని తెలిపారు. దీంతో ‘ఐ యామ్ గేమ్’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న అనంతరం మరో సినిమా షూటింగ్‌కు వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. తన ప్రొఫెషనల్ కమిట్‌మెంట్స్‌కు ప్రతిసారీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని, సినిమాల విషయంలో ప్రజలకు భిన్నమైన అభిప్రాయాలు ఉండటం సహజమేనని కాయదు పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!