

ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న మా ఇంటి బంగారం చిత్రంతో నటి సమంత మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని రాజ్ నిడిమోరు, సమంత, హిమాంక్ దువ్వూరు ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై నిర్మించారు. దిగంత్, గుల్షన్ దేవయ్య, గౌతమి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
విడుదలకు ముందే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూఏ సర్టిఫికెట్ను పొందింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ అంశాల సమ్మేళనంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందిస్తుందని నిర్మాతలు తెలిపారు. ప్రేక్షకులు వెచ్చించే సమయం, ఖర్చుకు తగిన విలువ కలిగిన చిత్రంగా ‘మా ఇంటి బంగారం’ నిలుస్తుందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా, ఓం ప్రకాశ్ ఛాయాగ్రహణం నిర్వహించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!