
జనరల్

కార్తీ హీరోగా తెరకెక్కుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’ విడుదల తేదీపై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మేకర్స్ విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో రిలీజ్ డేట్ లేకపోవడంతో సినిమా వాయిదా పడుతుందనే ప్రచారం జోరందుకుంది. దీంతో అభిమానుల్లో కూడా సందేహాలు వ్యక్తమయ్యాయి.
అయితే తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఇప్పటికే ప్రకటించిన సెప్టెంబర్ 10 విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది. పోస్టర్‌లో తేదీ లేకపోవడం వల్ల మాత్రమే ఈ ప్రచారం మొదలైందని, పాన్ ఇండియా విడుదలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు యథావిధిగా కొనసాగుతున్నాయని సమాచారం. త్వరలోనే చిత్రబృందం మరో కీలక అప్డేట్ ప్రకటించే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!