23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పెళ్లిపై మనసులో మాట చెప్పిన శ్రుతి హాసన్

Writer: Pooja 01:15 PM, 23 సెప్టెంబర్, 2026
పెళ్లిపై మనసులో మాట చెప్పిన శ్రుతి హాసన్

టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్, మల్టీ టాలెంటెడ్‌ నటి శ్రుతి హాసన్‌ పెళ్లిపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. బాలీవుడ్‌ నటి సోహా అలీ ఖాన్‌ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న శ్రుతి.. నలభైకి చేరువవుతున్నా సింగిల్‌గా ఉండటంపై స్పందించింది. తాను వివాహ వ్యవస్థకు వ్యతిరేకం కాదని, తనకు తోడుగా ఉండే భాగస్వామి కావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. అయితే ఒకే విధమైన ఆలోచనలు, పరిమితుల్లో ఇమిడిపోయే వ్యక్తిని కాదని, తన జీవితాన్ని తనకు నచ్చిన విధంగానే జీవిస్తానని చెప్పింది. కొన్ని విషయాల్లో తాను సంప్రదాయాలను పాటిస్తానని, మరికొన్ని విషయాల్లో పాత పద్ధతులను అనుసరిస్తానని పేర్కొంది. అయితే అవన్నీ తనపై ఎవరూ బలవంతం చేయడం వల్ల కాకుండా, తనకు నచ్చి స్వచ్ఛందంగా పాటించేవేనని స్పష్టం చేసింది.

పెళ్లిళ్లలో జరిగే ఆర్భాటం, భారీ ఖర్చులపై కూడా శ్రుతి హాసన్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. పెళ్లి పత్రాలు, కోట్ల రూపాయల ఖర్చులు, ఆడంబరాలను చూస్తే ఇదంతా ఎవరి కోసం చేస్తున్నామనే ఆలోచన వస్తుందని చెప్పింది. చట్టపరమైన పత్రాల బంధం కంటే ప్రతిరోజూ ఇద్దరూ మనస్ఫూర్తిగా ఒకరినొకరు ఎంచుకోవడమే నిజమైన ప్రేమ అని తాను నమ్ముతానని తెలిపింది. భారీగా ఖర్చు చేసేవారితో తనకు ఎలాంటి సమస్య లేదని, అయితే ఆ డబ్బును సేవా కార్యక్రమాలు లేదా దాతృత్వ కార్యక్రమాలకు వినియోగిస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడింది. గతంలో ఒకసారి పెళ్లి వరకు వెళ్లినప్పటికీ, అప్పుడు తనకు ఎలాంటి భయం కలగలేదని గుర్తుచేసుకుంది. తల్లిగా మారాలనే కోరిక తనకు ఉందని, అందుకు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పింది. పిల్లలను దత్తత తీసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అలాగే సహజంగా కూడా తల్లిగా మారాలని కోరుకుంటున్నట్లు వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆస్కార్ రేసులో భారత్ వెనుకబడటానికి కారణమిదే - అనురాగ్ కశ్యప్

ఆస్కార్ రేసులో భారత్ వెనుకబడటానికి కారణమిదే - అనురాగ్ కశ్యప్

అన్బిల్ అవన్ రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ

అన్బిల్ అవన్ రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ

విడుదలకు సిద్ధమైన విజయ్ ఆంటోనీ అప్పకుట్టి

విడుదలకు సిద్ధమైన విజయ్ ఆంటోనీ అప్పకుట్టి

డోరతీపై కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్

డోరతీపై కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్

వాయిదా పడిన వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ సినిమా ఆదర్శ కుటుంబం

వాయిదా పడిన వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ సినిమా ఆదర్శ కుటుంబం

బలమైన పాత్రల కోసం నిధి అగర్వాల్‌ ప్రయత్నం

బలమైన పాత్రల కోసం నిధి అగర్వాల్‌ ప్రయత్నం

ట్యాగ్లు
శ్రుతి హాసన్పెళ్లి పై వ్యాఖ్యలుమాతృత్వంసోహా అలీ ఖాన్టాలీవుడ్సినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆస్కార్ రేసులో భారత్ వెనుకబడటానికి కారణమిదే - అనురాగ్ కశ్యప్
సినిమాలు

ఆస్కార్ రేసులో భారత్ వెనుకబడటానికి కారణమిదే - అనురాగ్ కశ్యప్

అన్బిల్ అవన్ రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ
సినిమాలు

అన్బిల్ అవన్ రిలీజ్‌పై మేకర్స్ క్లారిటీ

విడుదలకు సిద్ధమైన విజయ్ ఆంటోనీ అప్పకుట్టి
సినిమాలు

విడుదలకు సిద్ధమైన విజయ్ ఆంటోనీ అప్పకుట్టి

డోరతీపై కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్
సినిమాలు

డోరతీపై కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్

వాయిదా పడిన వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ సినిమా ఆదర్శ కుటుంబం
సినిమాలు

వాయిదా పడిన వెంకటేశ్‌-త్రివిక్రమ్‌ సినిమా ఆదర్శ కుటుంబం

పెళ్లిపై మనసులో మాట చెప్పిన శ్రుతి హాసన్
సినిమాలు

పెళ్లిపై మనసులో మాట చెప్పిన శ్రుతి హాసన్

అంతర్‌రాష్ట్ర జలాల సమస్యల పరిష్కారం కోసం కర్ణాటక సీఎంతో తెలంగాణ మంత్రుల భేటీ
జనరల్

అంతర్‌రాష్ట్ర జలాల సమస్యల పరిష్కారం కోసం కర్ణాటక సీఎంతో తెలంగాణ మంత్రుల భేటీ

బాగ్దాద్‌కు ఇరాన్‌ విమానాలు నిలిపివేసిన ఇరాక్‌...
జనరల్

బాగ్దాద్‌కు ఇరాన్‌ విమానాలు నిలిపివేసిన ఇరాక్‌...

భారత్‌పై గ్లోబల్ ఇన్వెస్టర్లకు నమ్మకం.. పన్నుల విధానమే ఆందోళన: జేపీ మోర్గాన్ సీఈవో
బిజినెస్

భారత్‌పై గ్లోబల్ ఇన్వెస్టర్లకు నమ్మకం.. పన్నుల విధానమే ఆందోళన: జేపీ మోర్గాన్ సీఈవో

బలమైన పాత్రల కోసం నిధి అగర్వాల్‌ ప్రయత్నం
సినిమాలు

బలమైన పాత్రల కోసం నిధి అగర్వాల్‌ ప్రయత్నం

ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
జనరల్

ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

నంద్యాల జిల్లా గోరుకల్లు రిజర్వాయర్‌లో కలకలం..
జనరల్

నంద్యాల జిల్లా గోరుకల్లు రిజర్వాయర్‌లో కలకలం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!