7, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

E20 పెట్రోల్‌పై మోదీ సమాధానం చెప్పాల్సిందే: రాహుల్ గాంధీ

Writer: Chandrika 11:25 PM, 7 నవంబర్, 2026
E20 పెట్రోల్‌పై మోదీ సమాధానం చెప్పాల్సిందే: రాహుల్ గాంధీ

E20 పెట్రోల్ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. E20 పెట్రోల్‌లో 20 శాతానికి మించి ఇథనాల్ ఉందని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించడంతో వివాదం మొదలైంది. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీకి పలు సూటి ప్రశ్నలు సంధించారు.

ఈ సందర్భంగా పెట్రోల్‌లో పరిమితికి మించి ఇథనాల్ కలుపుతున్నారంటూ కేంద్రంపై ఎంపీ రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్‌లో 20 శాతం మాత్రమే ఇథనాల్ ఉందని కేంద్రం చెబుతుండగా.. వాస్తవంగా అంతకంటే ఎక్కువ మోతాదులో కలుపుతున్నట్లు ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వం ఏడు జిల్లాల నుంచి సేకరించిన పెట్రోల్ నమూనాలను గుర్తింపు పొందిన ప్రయోగశాలలో పరీక్షించగా.. ఈ విషయం బయటపడిందని తెలిపారు. మొత్తం 14 నమూనాలకు గానూ 11 నమూనాల్లో 20 శాతానికి మించి ఇథనాల్ ఉన్నట్లు తేలిందని రాహుల్ వెల్లడించారు. ఈ పరీక్షల్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) పెట్రోల్‌లో 31.2 శాతం, హిందుస్థాన్ పెట్రోలియం (HPCL)లో 30.5 శాతానికి మించి ఉన్నట్లు వెల్లడైందన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలైన ఐవోసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎస్‌తో పాటు ప్రైవేటు సంస్థలైన నయారా, షెల్ కంపెనీల పెట్రోల్ నమూనాల్లోనూ నిర్దేశిత 20 శాతం పరిమితికి మించి ఇథనాల్ ఉందని రాహుల్ ఆరోపించారు. ఆయా కంపెనీల సొంత ప్రయోగశాలలు మాత్రం దీనిని వెల్లడించలేదని విమర్శించారు. పెట్రోల్‌లో అధిక మోతాదులో ఇథనాల్ కలపడం వల్ల వాహనదారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆగ్రహించారు. దీని వల్ల వాహనాల మైలేజీ తగ్గడంతో పాటు తరచూ మరమ్మతులు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. అధిక ధర చెల్లించి పెట్రోల్ కొనుగోలు చేస్తున్న ప్రజలకు నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్ బంకుల్లో విక్రయిస్తున్న ఇంధనంలో ఎంత శాతం ఇథనాల్ ఉందో తెలిపే సమాచార వ్యవస్థ కూడా అందుబాటులో లేదని మండిపడ్డారు. దీంతో వాహనదారులకు తాము ఎలాంటి ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నామో తెలుసుకునే అవకాశం లేకుండా పోతోందని విమర్శించారు.


పెట్రోల్‌లో వాస్తవంగా ఎంత శాతం ఇథనాల్ కలుపుతున్నారో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. నిర్దేశిత 20 శాతం పరిమితిని మించి కలుపుతున్న కంపెనీలపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల నిజంగా ఎవరికి ప్రయోజనం కలుగుతోందో చర్చకు రావాలని సవాల్ విసిరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ముంబై ఆసుపత్రి నుంచి ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ డిశ్చార్జ్

ముంబై ఆసుపత్రి నుంచి ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ డిశ్చార్జ్

ఎమర్జెన్సీ విధించడం తప్పే.. ఇందిరా గాంధీ కూడా పశ్చాత్తాపపడ్డారు: సోనియా గాంధీ

ఎమర్జెన్సీ విధించడం తప్పే.. ఇందిరా గాంధీ కూడా పశ్చాత్తాపపడ్డారు: సోనియా గాంధీ

గ్రామీణ అభివృద్ధి, సంక్షేమమే కూటమి విజయానికి కారణం: పవన్ కళ్యాణ్

గ్రామీణ అభివృద్ధి, సంక్షేమమే కూటమి విజయానికి కారణం: పవన్ కళ్యాణ్

బొండపల్లిలో బొత్స కుమార్తెకు ఓటమి..

బొండపల్లిలో బొత్స కుమార్తెకు ఓటమి..

దీపావళి కానుకగా 4.5 లక్షల మందికి కొత్త చేయూత పింఛన్లు..

దీపావళి కానుకగా 4.5 లక్షల మందికి కొత్త చేయూత పింఛన్లు..

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై పోరాటం ఆపేది లేదు: అభిజిత్ దిప్కే

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై పోరాటం ఆపేది లేదు: అభిజిత్ దిప్కే

ట్యాగ్లు
రాహుల్ గాంధీకాంగ్రెస్ఇండియా కూటమిపెట్రోల్ప్రధానిమోడీఈ20సవాల్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ముంబై ఆసుపత్రి నుంచి ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ డిశ్చార్జ్
రాజకీయాలు

ముంబై ఆసుపత్రి నుంచి ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ డిశ్చార్జ్

E20 పెట్రోల్‌పై మోదీ సమాధానం చెప్పాల్సిందే: రాహుల్ గాంధీ
రాజకీయాలు

E20 పెట్రోల్‌పై మోదీ సమాధానం చెప్పాల్సిందే: రాహుల్ గాంధీ

ఎమర్జెన్సీ విధించడం తప్పే.. ఇందిరా గాంధీ కూడా పశ్చాత్తాపపడ్డారు: సోనియా గాంధీ
రాజకీయాలు

ఎమర్జెన్సీ విధించడం తప్పే.. ఇందిరా గాంధీ కూడా పశ్చాత్తాపపడ్డారు: సోనియా గాంధీ

ఒక్కొక్కరికి రూ.లక్షకు పైగా దీపావళి బోనస్‌
జనరల్

ఒక్కొక్కరికి రూ.లక్షకు పైగా దీపావళి బోనస్‌

ఇరాన్‌లో వైమానిక రక్షణ వ్యవస్థపై అమెరికా దాడులు
జనరల్

ఇరాన్‌లో వైమానిక రక్షణ వ్యవస్థపై అమెరికా దాడులు

దీపావళి రోజు ముహూరత్‌ ట్రేడింగ్‌ వేళలివే!
బిజినెస్

దీపావళి రోజు ముహూరత్‌ ట్రేడింగ్‌ వేళలివే!

గ్రామీణ అభివృద్ధి, సంక్షేమమే కూటమి విజయానికి కారణం: పవన్ కళ్యాణ్
రాజకీయాలు

గ్రామీణ అభివృద్ధి, సంక్షేమమే కూటమి విజయానికి కారణం: పవన్ కళ్యాణ్

కొడంగల్‌ను దేశానికే అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

కొడంగల్‌ను దేశానికే అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్ రెడ్డి

నిద్రే ఆదాయ వనరుగా మారింది.. యువతికి లక్షల్లో ప్రైజ్‌మనీ!
జనరల్

నిద్రే ఆదాయ వనరుగా మారింది.. యువతికి లక్షల్లో ప్రైజ్‌మనీ!

దేవిశ్రీ ప్రసాద్ ‘ఎల్లమ్మ’లో కొత్త కాస్టింగ్ అప్‌డేట్స్!
గాసిప్స్

దేవిశ్రీ ప్రసాద్ ‘ఎల్లమ్మ’లో కొత్త కాస్టింగ్ అప్‌డేట్స్!

షమీకి మరో అవకాశం ఇవ్వాల్సింది- రవిశాస్త్రి
క్రీడలు

షమీకి మరో అవకాశం ఇవ్వాల్సింది- రవిశాస్త్రి

బొండపల్లిలో బొత్స కుమార్తెకు ఓటమి..
రాజకీయాలు

బొండపల్లిలో బొత్స కుమార్తెకు ఓటమి..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!