

మహారాష్ట్ర సీనియర్ రాజకీయ నాయకుడు, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, పరిశీలన అనంతరం శనివారం ఆయనను వైద్యులు ఇంటికి పంపించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
కాగా.. పవార్‌కు నిరంతర దగ్గు, ఛాతీలో అసౌకర్యం కలగతడంతో ఇటీవల పుణేలోని రూబీ హాల్ క్లినిక్‌లో చేర్చారు. అక్కడ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించి డిశ్చార్జ్ చేశారు. అయితే.. మరిన్ని వైద్య పరీక్షలు, ఆరోగ్య పరిశీలన కోసం కుటుంబ సభ్యులు ఆయన్ను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే సోషల్ మీడియా 'ఎక్స్'లో వెల్లడించారు. అదనపు వైద్య పరీక్షల కోసమే తన తండ్రిని ఆసుపత్రిలో చేర్పించామన్న ఆమె.. ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నవారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఆస్పత్రి నుంచి పవార్ డిశ్చార్జ్ కానున్న సందర్భంగా మహారాష్ట్ర మంత్రి కదమ్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని తిరిగి ప్రజాజీవితంలో చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!