

కొనంకి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక యాక్షన్ థ్రిల్లర్ ‘సోల్జర్ – 24×7 ఆన్ డ్యూటీ’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం అధికారికంగా విడుదల చేసింది. దేశభక్తి, ధైర్యం, త్యాగం, కర్తవ్యనిబద్ధత ప్రధానాంశాలుగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఫస్ట్ లుక్‌లో కొనంకి కార్తీక్ శక్తివంతమైన సైనికుడి పాత్రలో కనిపిస్తూ ఆకట్టుకున్నారు. యుద్ధ వాతావరణం, భారత త్రివర్ణ పతాకం నేపథ్యంలో రూపొందిన పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.
‘24×7 ఆన్ డ్యూటీ’ అనే ట్యాగ్‌లైన్‌తో భారత సరిహద్దుల్లో నిరంతరం విధులు నిర్వహించే సైనికులకు ఈ చిత్రం నివాళిగా నిలవనుంది. ఈ చిత్రంలో కొనంకి కార్తీక్, ప్రియాంక వర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రద్ధ ఖత్రి కథ, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కె.వి. నాయుడు కొనంకి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. యాక్షన్, భావోద్వేగాలు, దేశభక్తి, మానవీయ విలువల సమ్మేళనంగా ఈ చిత్రం రూపొందుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!