

ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి సోనాలి బింద్రే ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్‌పై దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో తొలిసారిగా ప్రజెంటర్‌గా మరాఠీ చిత్రం ‘సోహ్లా’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరాఠీలో ‘సోహ్లా’ అంటే ఉత్సవం లేదా వేడుక అని అర్థం. దర్శకుడు సాయికత్ బాగ్బన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 13 ఏళ్ల చురుకైన బాలుడు ‘పశ్యా’ చుట్టూ సాగే అందమైన భావోద్వేగ కథగా రూపొందుతోంది. ప్రవీణ్ దాలింబ్కర్, దేవదత్త ప్రశాంత్ గోనే, వర్షా మాల్వడ్కర్, వైష్ణవి సంజయ్ ఘోడ్కే, అలెస్సాండ్రా వీలన్ మెరెడిజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
‘సోహ్లా’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఇందులో నలుగురు పిల్లలు సంతోషంగా కనిపిస్తుండగా, పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల కానుంది. గోల్డీ బెహల్‌తో పాటు సచిన్ శ్రీవాస్తవ్, రత్నా శ్రీవాస్తవ, కవిత బాగ్బన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసే బాధ్యతను సినీపోలిస్ చేపట్టనుంది.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!