

టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. ఆమెకు సంబంధించినదిగా చెబుతున్న ఓ వ్యక్తిగత వీడియో తాజాగా వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోవద్దని, సంబంధాలు పూర్తిగా ఆమె ఇష్టమని సమర్థిస్తుండగా, మరికొందరు వయస్సు వ్యత్యాసాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైరల్ అవుతున్న వీడియో, తనపై జరుగుతున్న ప్రచారంపై సురేఖావాణి స్పందించారు.
తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అయిందని, తన అనుమతి లేకుండానే వ్యక్తిగత సమాచారాన్ని బయటపెట్టి ప్రచారం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. మీమ్ పేజీలు, మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెళ్లు, నెటిజన్లు ఎవరూ ఆ కంటెంట్‌ను రీపోస్ట్ చేయడం లేదా షేర్ చేయడం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. కేవలం వ్యూస్, రీచ్, పబ్లిసిటీ కోసం ఈ అంశాన్ని ఉపయోగించుకోవద్దని హెచ్చరించారు. తన ప్రైవేట్ కంటెంట్‌ను ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి, ఆధారాలు సేకరించిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. తన వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని కోరుతూ, ఈ వ్యవహారంపై న్యాయపోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!