

దీపావళి, పొంగల్ వంటి పండుగల సందర్భంగా ప్రముఖ కథానాయకులు నటించిన భారీ చిత్రాలను విడుదల చేయడం సినీ పరిశ్రమలో ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో నటుడు విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘పాకెట్ నావెల్’ 2027 జనవరిలో పొంగల్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్యాగరాజన్ కుమార రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టైలర్ డర్డన్ అండ్ కినో ఫెస్ట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. మాళవిక మోహనన్, రాజ్ బి. శెట్టి, కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా, నిరోషా సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
‘సూపర్ డీలక్స్’ సినిమా తర్వాత విజయ్ సేతుపతి, దర్శకుడు త్యాగరాజన్ కుమార రాజా కలయికలో వస్తున్న చిత్రం కావడంతో ‘పాకెట్ నావెల్’పై ఆసక్తి నెలకొంది. తొలుత ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించనున్నట్లు ప్రకటించారు. అయితే దర్శకుడితో విభేదాలు తలెత్తినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. అనంతరం జీవీ ప్రకాష్ కుమార్‌ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు. ఆండ్రూ లూయిస్ ఈ చిత్రానికి కథ, కథనం అందించారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ ద్వారా 2027 పొంగల్‌కు సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!