

సూర్య ప్రధాన పాత్రలో జీతూ మాధవన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సీన్’. నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా నవంబరు 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సూర్య పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గతంలో తన మూడు సినిమాల్లో నటించాల్సిందిగా నజ్రియాను సంప్రదించానని, అయితే వివిధ కారణాలతో ఆమె ఆ అవకాశాలను తిరస్కరించారని తెలిపారు. నాలుగోసారి అడిగినప్పుడు ఆమె అంగీకరించారని చెప్పారు.
కథల ఎంపిక విషయంలో నజ్రియా చూపించే ఆత్మవిశ్వాసాన్ని సూర్య ప్రశంసించారు. తన ఆఫర్లను తిరస్కరించినందుకు ఆమె ఎప్పుడూ అవకాశాలు కోల్పోయానని భావించలేదని పేర్కొన్నారు. మరోవైపు, 12 ఏళ్ల తర్వాత తమిళ సినిమాల్లోకి తిరిగి రావడానికి సూర్యనే ప్రధాన కారణమని నజ్రియా తెలిపారు. గతంలో కొన్ని కారణాల వల్ల ఆయనతో కలిసి నటించే అవకాశాలను ఒకట్రెండుసార్లు వదులుకున్నానని, ఇప్పుడు ‘సీన్’లో ఆయనతో కలిసి నటించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!